రైతులకు మేలు చేసి ఉంటే చర్చకు సిద్ధం : రేవంత్ రెడ్డి

by Kalyani |   ( Updated:2023-11-07 13:42:48.0  )
రైతులకు మేలు చేసి ఉంటే చర్చకు సిద్ధం : రేవంత్ రెడ్డి
X

దిశ ,గద్వాల ప్రతినిధి : తెలంగాణ ముఖ్యమంత్రి గత పది సంవత్సరాల కాలంలో రైతాంగానికి ఎలాంటి మేలు చేయలేదని అబద్దాలు, మాయ మాటలతో మోసం చేస్తున్నాడని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రం లో ప్రజా గర్జన పేరిట ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సభలో ఆయన మాట్లాడుతూ.....తెలంగాణ రైతాంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చిఉంటే విద్యుత్ సబ్ స్టేషన్ లోని లాక్ బుక్ లు చూపించండి 24 గంటలు విద్యుత్ రైతాంగానికి ఇచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీ తరుపున నామినేషన్ లు వేయమని ఓట్లు బీ ఆర్ ఎస్​ పార్టీ కే వేయించుకొమని సవాల్ విసిరారు. ఒక వేళ 24 గంటలు రైతాంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వలేదని రుజువు అయితే గద్వాల బస్టాండ్ ఎదురుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెంపలు వేసుకోవలని సవాల్ విసిరారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ ,పాలమూరు రంగ రెడ్డి ప్రాజెక్ట్ ల ద్వారా కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నామని రైతులకు మోస మాటలు చెపుతున్న కేసీఆర్ గత పది సంవత్సరాల ప్రభుత్వ పాలన లో 18 లక్షల నుంచి 25 లక్షల పంపు సెట్లు ఎందుకు పెరిగాయో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఉచిత విద్యుత్ ఆలోచన కాంగ్రెస్ పార్టీ దని,గతంలో వై ఎస్ ఆర్ చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర లో భాగంగా రైతాంగ కష్టాలు చూసి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్యుత్ రైతాంగానికి అందించామని , అంతేకాక 12 వందల కోట్ల విద్యుత్ బకాయిలను రద్దు చేసి, రైతులపై ఉన్నా అక్రమ కేసులను తొలగించి రైతులను ఆదుకున్నది కాంగ్రెస్స్ పార్టీయేనని తెలిపారు.

పాలమూరు జిల్లాకు జూరాల, నెట్టంపాడు,భీమా , కోయిల సాగర్, ఆర్ డి ఎస్ ,కల్వకుర్తి ప్రాజెక్ట్ లను నిర్మాణం చేసి పాలమూరు జిల్లా ను సస్యసమలం చేసింది కాంగ్రెస్స్ పార్టీ అని ఆయన తెలిపారు. గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు జిల్లా కు ఏమీ చేసిందో చెప్పాలని ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు. జిల్లా లో వాల్మీకి కులస్తులు ఎక్కువగా ఉన్నారని వారి చిరకాల కోరిక ఐనా ఎస్టీ జాబితాలో చేర్చడం ఈ ప్రభుత్వం చేయడం లేదని కాంగ్రెస్స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చారు. వాల్మీకి కులస్తులకు చట్ట సభలో తగిన ప్రాధాన్యత కల్పించి ఎమ్మెల్సీని వారికి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్స్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను తప్పకుండా అధికారం లోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ఆయన ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు,మల్లు రవి,మోహన్,మేఘ రెడ్డి, మధు బాబు,బక్క చంద్రన్న,శంకర్,ఇతర కాంగ్రెస్స్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed