SP: డ్రంకన్ డ్రైవ్ లో పట్టుపడితే జైలుకు పంపిస్తాం

by Kalyani |
SP: డ్రంకన్ డ్రైవ్ లో పట్టుపడితే జైలుకు పంపిస్తాం
X

దిశ నాగర్ కర్నూల్ :- డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారిని జైలుకు పంపిస్తామని జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ వాహన దారులను హెచ్చరించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కార్యాలయాన్ని నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి డిఎస్పీలు బుర్రి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఎస్పీ మాట్లాడుతూ...నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ స్టేషన్ లో 14 మంది టీం తో ట్రాఫిక్ పోలీస్ వింగ్ ని ప్రారంభించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్, వితౌట్ నెంబర్ ప్లేట్,మైనర్ డ్రైవింగ్ లో పట్టుబడినటువంటి 200 మంది తోటి అవేర్నెస్ ప్రోగ్రాం ని కండక్ట్ చేసి వాళ్లకు ట్రాఫిక్ రూల్స్ గురించి వివరించారు. రోడ్డు ప్రమాదంలో అధిక మరణాలు సంభవిస్తున్నాయని వాటిని నిలువరించడానికి జిల్లాలో ట్రాఫిక్ రూల్స్ పాటించేలా నూతన స్టేషన్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్,మైనర్లు డ్రైవింగ్ చేస్తే బండిని సీజ్ చేసి వాళ్లను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ డిఎస్పి శ్రీనివాస్ అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్ కల్వకుర్తి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఏఆర్ డీఎస్పీ చారి, నాగర్ కర్నూల్ ఎస్సై గోవర్ధన్ ఆర్ఎస్ఐలు కళ్యాణ్, గౌస్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed