రెవెన్యూ అడిషనల్ కలెక్టర్‌కు ఐఏఎస్ హోదా.. ప్రోటోకాల్ ఫ్లెక్సీలో దొర్లిన తప్పు

by Aamani |   ( Updated:2024-08-14 13:15:35.0  )
రెవెన్యూ అడిషనల్ కలెక్టర్‌కు ఐఏఎస్ హోదా.. ప్రోటోకాల్ ఫ్లెక్సీలో దొర్లిన తప్పు
X

దిశ,నారాయణపేట క్రైమ్: నారాయణపేట మండలం అప్పకపల్లి గ్రామ శివారులో మెడికల్ కళాశాల లో బుధవారం ప్రారంభ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు కలెక్టర్ సిక్త పట్నాయక్ , ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి హాజరయ్యారు. అయితే మెడికల్ కళాశాల ఆవరణలో రెండు మూడు చోట్ల ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ ప్రోటోకాల్ ఫ్లెక్సీ లో ముఖ్య అతిథుల, మెడికల్ కళాశాల అనుబంధ అధికారుల పేర్లను పెట్టారు.

అయితే నారాయణపేట జిల్లాలో ప్రస్తుతం ముగ్గురు ఐఏఎస్ హోదా కలిగిన వారు ఉన్నారు. ఒకరు కలెక్టర్ అయితే... మరొకరు లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ మయంక్, మరొకరు ట్రైనీ కలెక్టర్ గరిమ నరుల ఉన్నారు. కానీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ పేరు మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లో రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ పేరు పక్కన ఐఏఎస్ అని పెట్టడం కోసమెరుపు. వాస్తవానికి రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ ను ఐఏఎస్ గా పరిగణించారు. కేవలం అడిషనల్ కలెక్టర్ గానే పరిగణిస్తారు. ఇది చూసిన పలువురు ప్రోటోకాల్ వివరాలు కూడా తెలియక పోతే భవిష్యత్తులో కళాశాల ను ఎలా నడుపుతారని గుసగుసలాడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed