- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ కు భారీ షాక్..
దిశ, మహబూబ్ నగర్ : రాష్ట్ర పరిపాలనలో వైఫల్యాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడం, అబద్దాల వాగ్దానాలతో ప్రజలను మోసం చేయడం బీఆర్ఎస్ పార్టీ నిజస్వరూపమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి.మధుసూధన్ రెడ్డి ఆరోపించారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని హన్వాడ మండలం యారోనిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జిల్లా కేంద్రంలోని 27వ వార్డు, వల్లభ్ నగర్, గణేష్ నగర్ కు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సంధర్భంగా కాంగ్రెస్ నాయకులు ఒబెదుల్లా కొత్వాల్, సంజీవ్ ముదిరాజ్, జీఎంఆర్ లు వారికి కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోనికి ఆహ్వానించారు. అనంతరం జీఎంఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలన, నిరుద్యోగంతో విసిగి వేసారిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్దంగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ చేరికలు ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నుండి పెద్ద ఎత్తున ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్దంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీజె బెనహర్, వసంత, అనిత, సాయిబాబా, లక్ష్మణ్ యాదవ్, మల్లు నర్సింహరెడ్డి, హన్వాడ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటయ్య, టంకరి కృష్ణ యాదవ్, చంద్రశేఖర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.