Happy Delivery: 108 అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లీ, బిడ్డా క్షేమం

by Shiva |
Happy Delivery: 108 అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లీ, బిడ్డా క్షేమం
X

దిశ, గార్ల: 108 అంబులెన్స్ సిబ్బంది ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడటమే కాదు.. పురిటి నొప్పులతో ఉన్న గర్భవతికి సుఖ ప్రసవం చేసి మరోసారి మానవత్వాన్ని చాటారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం గుంపెలగూడెంకు చెందిన కన్యాకుమారికి బుధవారం నొప్పులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే 108కి సమాచారం అందజేశారు. వెంటనే గ్రామానికి వెళ్లిన టీం ప్రసవ వేదన పడుతున్న తల్లిని దావఖానకు తరలిస్తుండగా ఆమె మార్గమధ్యలోనే ప్రసవించింది. 108 ఈఎంటీ ఎల్.శ్రీనివాస్ చాకచక్యంగా వ్యవహరించి కన్యాకుమారికి ప్రసవం చేశారు. ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వగా.. ఇద్దరినీ మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు 108 సిబ్బంది తెలిపారు. ఈ క్రమంలో క్షేమంగా ప్రసవం చేసిన ఈఎంటీ ఎల్.శ్రీనివాస్, పైలెట్ సైదులుకు మహిళ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story