- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గంగా జమునా తెహజీబ్ కు తెలంగాణ ప్రతీక: రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ
దిశ, మహబూబ్ నగర్: గంగా జమునా తెహజీబ్ కు తెలంగాణ ప్రతీక అని, లౌకిక వాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. పట్టణంలో ఎస్ఎన్ ఫంక్షన్ హల్ లో నిర్వహించిన సబ్బండ వర్గాల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలసి పాల్గొని ప్రసంగించారు. విభిన్న మతాలు, భాషలు, రాష్ట్రాల ప్రజలు కలిసి జీవించే తెలంగాణలో గంగా జమునా తెహజీబ్ సంస్కృతి శతాబ్దాలుగా విలసిల్లుతోందని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ దేశంలోనే అత్యంత అద్భుతంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.
ఒకప్పడు ఎంతో వెనుకబడి ఉన్న మహబూబ్ నగర్ నేడు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పట్టణంలో రోడ్లు, మౌలిక వసతులను అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. రాష్ట్రానికి మంత్రి అయినా నిత్యం నియోజకవర్గ అభివృద్ధి పైనే ఆయన ధ్యాస పెడతారని హోం మంత్రి అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ప్రజలు అండగా ఉండాలని సూచించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కులమతాల పేరిట బీజేపీ రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని, దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ విక్రయిస్తూ యువతకు ఉద్యోగాలు లేకుండా చేసిందని ఆయన విమర్శించారు.
అంతకుముందు హన్వాడ మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో 74 మంది లబ్ధీదారులకు 74,01,184 లక్షల విలువైన కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమాలలో మైనార్టీ పైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ ఇంతియాజ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ రెహమాన్, వైస్ చైర్మెన్ గిరిధర్ రెడ్డి, జడ్పీ కో ఆఫ్షన్ చైర్మెన్ అన్వర్, ఎండీ హనీఫ్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.