- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మైలారం శివాలయం వద్ద గుప్త నిధుల ముఠా సంచారం..
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామ సమీపంలో ఉన్న శివాలయం వద్ద గుప్తనిధుల ముఠా శుక్రవారం ఆలయ సమీప వ్యవసాయ పొలాలలో బంగారం కోసం అన్వేషణ చేస్తూ గ్రామస్తులకు పట్టుబడిన సంఘటన కలకలం రేపుతుంది. గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి గత కొంతకాలంగా శివాలయ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తుల సంచారం నిరంతరం కొనసాగుతున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు. గతంలో కూడా శివాలయం వద్ద బంగారం నిక్షేపాల కోసం తవ్వకాలు చేసి పెద్ద మొత్తంలో బంగారం తీసుకెళ్లారని ఆరోపణలు కూడా ఉన్నాయి.
అన్వేషణ యంత్రంతో..
మైలారం గ్రామ సమీపంలో పూర్వీకులు నిర్మించిన శివాలయం వద్ద పెద్ద మొత్తంలో బంగారం ఉన్నట్లు పలువురు భావిస్తున్నారనీ తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బంగారం ముఠా సభ్యులకు స్థానికుల అండదండలతోనే గుట్టుచప్పుడు కాకుండా బంగారం నిక్షేపాల అన్వేషణ నిరంతరాయంగా కొనసాగుతుందని తెలుస్తుంది. శుక్రవారం మైలారం గ్రామస్తుడు తోపాటు ఆ నలుగురూ సభ్యుల ముఠాశివాలయ సమీప పొలంలో బంగారం అన్వేషణ యంత్రంతో పరిశీలన తుండగా గ్రామస్తులు వారిని గుర్తించి పట్టుకున్నట్లు తెలిసింది.
స్థానికుని అండదండలతో..
మైలారం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ద్వారా ఇతర ప్రాంతాలకు చెందిన మరో ముగ్గురు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి శివాలయ సమీపంలో బంగారం అన్వేషణ చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్థానికుని సహకారం ఉండడంతోనే గుప్తనిధుల మూట యదేచ్చగా సంచారం చేస్తూ ఎక్కడెక్కడ బంగారం నిధులు ఉన్నాయో అన్వేషణ యంత్రం ద్వారా పరిశీలన చేస్తున్నట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. శుక్రవారం శివాలయ సమీప వ్యవసాయ పొలంలో అన్వేషణ చేస్తున్న ముఠా సభ్యులను గ్రామస్తులు పట్టుకున్నట్లు సమాచారం.
ఈ వ్యవహారం పై గ్రామస్తులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ ముఠా సభ్యుల గురించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. పట్టుబడ్డ ముఠా సభ్యులను ముఠాకు సహకరించిన స్థానిక వ్యక్తి ద్వారానే తప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పై విషయం పై బల్మూరు పోలీసులను దిశ ఫోన్ ద్వారా వివరణ కోరగా.. అందుకు సంబంధించి పూర్తిసమాచారం మాకు రాలేదని, గ్రామస్తుల నుండి ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.