బస్టాండ్ ఆధునీకరణకు నిధులు కేటాయిస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Shiva |   ( Updated:2023-02-14 14:31:39.0  )
బస్టాండ్ ఆధునీకరణకు నిధులు కేటాయిస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ,మహబూబ్ నగర్: ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించి, సౌకర్యవంతమైన వసతులు కల్పించాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు నూతనంగా బదిలీపై వచ్చిన ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం.శ్యామల మంగళవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో పాలమూరు బస్టాండ్ ను పరిశీలించినప్పుడు ప్రయాణికులకు సరైన వసతులు లేవని, అందుకు నిధులు కేటాయిస్తామని ఇచ్చిన హామీ మేరకు బస్టాండ్ ఆధునీకరణకు ఆమె రూ.50లక్షల నిధుల అంచనా పత్రాన్ని మంత్రికి అందజేశారు. మంత్రిని కలసిన వారిలో డిపో మేనేజర్ సుజాత, టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి జి.లక్ష్మణ్ గౌడ్, తదితరులున్నారు.

వేపూరి చిన్నారెడ్డి సేవలు మరువలేనిమి

రెడ్డి సేవా సమితి జిల్లా గౌరవాధ్యక్షుడు దివంగత వేపూరి చిన్నారెడ్డి సామాజిక కార్యక్రమాలతో ఎందరికో సేవ చేసి ఇటీవలే మరణించడం దురదృష్టకరమన్నారు. మంగళవారం పట్టణంలోని రాజా బహద్దూర్ వెంకట్రామా రెడ్డి కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన చిన్నారెడ్డి దశదిన కర్మ కార్యక్రమానికి మంత్రి హజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రెడ్డి హాస్టల్ ద్వారా కేవలం రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే కాకుండా, ఎందరో పేద విద్యార్థులు చదువుకునేందుకు చేయూతనిచ్చాడని కొనియాడారు. ఆయన భౌతికంగా మన ముందు లేకపోయినా ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ నర్సింహులు, వైస్ చైర్మెన్ గణేష్, మార్కెట్ కమీటీ వైస్ చైర్మెన్ గిరిధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story