- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిండా నిర్లక్ష్యం.. విద్యార్థుల ప్రాణాలకు ముప్పు తెస్తున్న మధ్యాహ్న భోజనం
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆయా విద్యాసంస్థల సిబ్బంది, అధ్యాపకులు, అధికారుల నిర్లక్ష్యం పిల్లల ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి. గత సంవత్సర కాలంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు విద్యాసంస్థలలో జరుగుతున్న సంఘటనలతో ఇటు అధికారులు.. అటు సిబ్బంది మేల్కోకపోవడం వల్ల సంఘటనలు పదేపదే జరుగుతున్నాయి. ఆ మధ్య అచ్చంపేట నియోజకవర్గంలో జరిగిన రెండు సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.. పలువురు సిబ్బందిని విధుల నుంచి తప్పించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా వాటిని వెలుగులోకి రాకుండా కొంతమంది జాగ్రత్తలు పడుతున్నారు.
మూడు నెలల్లో రెండవసారి...
మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది విద్యార్థులు రెండుసార్లు అస్వస్థతకు గురయ్యారు. మూడు నెలల క్రితం కుళ్లిన కూరగాయలు, తదితరాల వాడకం వల్ల పదిమంది కి పైగా విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. ఆ సంఘటన జరిగిన తర్వాత ఉపాధ్యాయులు గాని.. సిబ్బంది గానీ జాగ్రత్తలు తీసుకోకపోవడంతో బుధవారం మరో మారు సంఘటన జరిగింది. ఏకంగా వందమంది విద్యార్థులకు అస్వసత గురవడం, అందులో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ తరలించారు. ఈ సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు.. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి బాధిత విద్యార్థులను పరామర్శించారు. మరోవైపు తమ పిల్లలు అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.
కుళ్లిన గుడ్లు.. కూరగాయలే కారణమా..!?
వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలకు ప్రధానంగా కుళ్లిన కూరగాయలు, గుడ్లే కారణంగా తెలుస్తోంది. కుళ్లిన కూరగాయలు, గుడ్లతో వంట చేయడం వల్లే విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురవుతున్నారు. సంఘటనలు జరిగినప్పుడు తప్ప మిగతా సమయాలలో అధికారులు భోజన పథకాల అమలు తీరుపై పర్యవేక్షించకపోవడంతో వంట ఏజెన్సీలవారు ఇష్ఠారీతిగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితులను అధిగమించాలంటే ఆయా విద్యా సంస్థలలో ఉన్న అధ్యాపకులు, సిబ్బంది మధ్యాహ్న భోజనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పలువురు పేర్కొంటున్నారు.