ఆర్మీ అగ్ని వీరులకు ఉచిత ఫిజికల్ శిక్షణ..

by Kalyani |
ఆర్మీ అగ్ని వీరులకు ఉచిత ఫిజికల్ శిక్షణ..
X

దిశ, ప్రతినిధి నారాయణపేట: నారాయణపేట జిల్లాలో వారియర్స్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆర్మీ (అగ్ని వీర్), పోలీస్ఉద్యోగాలకై ఉచిత ఫిజికల్ శిక్షణను ఇదివరకు అందించి ఎంతో మంది నిరుద్యోగులకు తోడ్పాటును అందించారు. తిరిగి మే 1 వ తేదీ నుంచి ఆర్మీ అగ్ని వీరులకు ఉచిత ఫిజికల్ శిక్షణను నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రారంభిస్తున్నట్లు అకాడమీ నిర్వాహకులు ఆంజనేయులు ఓ ప్రకటనలో తెలిపారు. అకాడమీలో శిక్షణ పొందే విద్యార్థులకు హాస్టల్, జిమ్, స్టడీ హాల్, ఫిజికల్ శిక్షణ పూర్తిగా ఉచితంగా అందిస్తామని ఈ ఉచిత శిక్షణకు తనతో పాటు దాతలు ఎవరైనా సాయంగా నిలిచి నిరుద్యోగుల ఉన్నతికి పాటుపడాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9086271418, 8790153723 లను సంప్రదించాలని కోరారు.

Advertisement

Next Story