- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫోర్టిఫైడ్ రైస్ పౌష్టికాహారమే - తహసీల్దార్ జె కె మోహన్
దిశ తిమ్మాజీపేట:- ఫ్లోరి పైడ్ రైస్ పౌష్టికాహారమే అని తహసీల్దార్ జేకె మోహన్ అన్నారు. మండల పరిధిలోని బాజీపూర్ గ్రామంలో రేషన్ బియ్యం లో ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయని కొందరు యువకులు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం తో మరికొన్ని గ్రామాల్లో రేషన్ బియ్యం తీసుకునేందుకు వినియోగదారులు వెనుకంజ వేస్తున్న విషయాన్ని డీలర్లు గురువారం తహసీల్దార్ దృష్టికి తీసుకువచ్చారు. డీలర్లు తీసుకువచ్చిన రేషన్ బియ్యంను తహసీల్దార్కార్యాలయంలో ఆయన పరిశీలించారు.
రేషన్ బియ్యం లో ఫోర్టిఫైడ్ రైస్ కలవడం వల్ల వినియోగదారులు తమను నిలదీస్తున్నారని డీలర్లు తహసీల్దార్కు వివరించారు. రేషన్ బియ్యం లో ప్లాస్టిక్ బియ్యం పంపిణీ చేస్తున్నారని వస్తున్న వదంతులను డిఎంకు తెలిపారు. ఆగస్టు నుంచి ఫోర్టిఫైడ్ రైస్ ప్రభుత్వమే సరఫరా చేస్తుందని ప్రతి క్వింటాల్ రేషన్ బియ్యం లో కిలో ఫోర్టిఫైడ్ రైస్ కలిపి స్టాక్ పాయింట్ కు చేరుకుంటుందని స్టాక్ పాయింట్ నుండి జిల్లాలోని ఆ డీలర్లకు పంపిణీ చేస్తున్నామని డియం తహసీల్దార్కు వివరించారు
.ఫోర్టిఫైడ్ రైస్ తినడం వలన ఎలాంటి ఇబ్బంది ఉండదని పౌష్టికాహారం గా తీసుకోవచ్చని స్టాక్ పాయింట్ డి ఎం తెలిపారు. ఆయా గ్రామాలలోని రేషన్ దుకాణాలకు ప్రభుత్వమే రేషన్ బియ్యం ఫోర్టిఫైడ్ రైస్ కలిపి పంపిస్తున్నందున వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రజలకు సూచించారు. డీలర్లు ఆయా గ్రామాల వినియోగదారులకు గురించి అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ రాజేందర్ రెడ్డి, ఎం ఆర్ ఐ మురళీధర్ ఏ ఆర్ ఐ పవన్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలీ బాబు, తదితరులు ఉన్నారు.