ఎమ్మెల్సీ కవిత ఫ్లెక్సీలు చించివేత

by S Gopi |
ఎమ్మెల్సీ కవిత ఫ్లెక్సీలు చించివేత
X

దిశ, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి సంబంధించి ఎంజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 220 జంటలకు ఉచితంగా సామూహిక వివాహ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని తలపెట్టారు. ఆదివారం ఉదయం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. ఆమెకు స్వాగతం చెబుతూ నియోజవర్గవ్యాప్తంగా విస్తృతస్థాయిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కానీ శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బిజినేపల్లి నుంచి పాలెం మధ్యలో మూడు ఫ్లెక్సీలను కోటల్ గడ్డలో ఒక ఫ్లెక్సీని చించివేశారు. గతంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత గిరిజన ఆత్మగౌరవ సభ భారీ ఎత్తులో బిజినేపల్లిలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను కూడా గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారు. కాంగ్రెస్ నాయకులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇలా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీల తొలగింపు, చించివేత రాజకీయ రగడకు దారితీసింది. తాజాగా మర్రి జనార్దన్ రెడ్డి ట్రస్టు ఏర్పాటు చేసిన ఉచిత వివాహాల ఫ్లెక్సీలను చించివేయడం పట్ల రాజకీయ వేడి మరింతగా ఉధృతం అయిందని ఇట్టి ఫ్లెక్సీలను చూసిన స్థానికులు కలకలం నెలకొన్నదని చెప్పవచ్చు.

Advertisement

Next Story