- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫీజుల పట్టిక ఉంచాలిః కలెక్టర్ విజయేందిర బోయి
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : ప్రైవేటు ఆసుపత్రుల్లో చేసే చికిత్స వివరాలు, ఫీజులను ఆసుపత్రిలో పట్టిక పెట్టాలనికలెక్టర్ విజయేందిర బోయి ప్రైవేటు యాజమాన్యాలను ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆమె ప్రైవేటు ఆసుపత్రుల యాజమానులు, డాక్టర్లతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అత్యవసరమైతే తప్ప రోగులను ఆసుపత్రులలో చేర్చుకోవద్దని, అన్ని జ్వరాలు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, జ్వరాల నిర్ధారణలో పూర్తిగా రాపిడ్ టెస్ట్ పై ఆధారపడకుండా ఎలిసా టెస్ట్ చేసిన తర్వాత నిర్ధారించాలని ఆమె తెలిపారు. ఒకవేళ ఎక్కడైనా ప్రైవేట్ ఆస్పత్రులలో ఎలిసా టెస్ట్ లేనట్లయితే ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలని.. ప్రజలలో డెంగ్యూ పట్ల అనవసరమైన భయాలను కల్పించవద్దని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, డిసిహెచ్ఎస్ సలహాలు సూచన ప్రకారం డెంగ్యూ కేసులను నిర్ధారించాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా ఈ సీజన్ పూర్తయ్యే వరకు సీజనల్ వ్యాధులైన జ్వరాలు, విష జ్వరాలు, డెంగ్యూ, డయేరియా వంటి వాటిపై క్రమం తప్పకుండా ప్రతిరోజు సమాచారాన్ని అందించాలన్నారు.
ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రామ్మోహన్ మాట్లాడుతూ.. జిల్లాలో దాదాపు 60 శాతం ఆస్పత్రులవారు అందిస్తున్న సేవల ఫీజులను ఆసుపత్రుల వద్ద ప్రదర్శిస్తున్నారని.. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డిఎంహెఓ డాక్టర్ జి.పద్మశ్రీ, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్, ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్లు సామ్యూల్, నిశాంత్, ప్రభుత్వ డాక్టర్లు శశికాంత్, భాస్కర్ నాయక్, డాక్టర్ రఫీ, తదితరులు పాల్గొన్నారు.