- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కూతురు బతికుండగానే పిండం పెట్టిన తండ్రి.. విషయం తెలిస్తే షాక్..
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కూతురు ప్రేమ వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక ఓ తండ్రిదిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కూతురు ప్రేమ వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక ఓ తండ్రి తన ఆక్రోశాన్ని వినూత్న రీతిలో వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన ఓ యువతి అదే గ్రామనికి చెందిన తమ సమీప బంధువైన యువకుడిని ప్రేమించింది. తొమ్మిది సంవత్సరాల నుంచి వారి ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నట్లు సమాచారం. ఇంట్లో యువతికి వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. దీనితో వారిద్దరూ ఈనెల 13న ఇద్దరు హైదరాబాద్ వెళ్లి ఓ దేవాలయంలో వివాహం చేసుకున్నారు. ఈనెల 15న గ్రామానికి తిరిగి వచ్చారు. ఇరువురు వారి ఇంట్లో ఉన్నారు. ఈ క్రమంలో గ్రామంలో పంచాయతీ పెట్టారు. ఈ సందర్భంగా మీ పెళ్లి తర్వాత చేస్తాను. ఇంటికి రా అని తండ్రి కూతుర్ని కోరాడు. అందుకామె సమ్మతించక పోవడంతో పంచాయతీ జరుగుతుండగానే ఆవేశంలో ఉన్న తండ్రి తన కూతురు పాదాలు మొక్కి అక్కడి నుండి వెళ్లిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. వెళ్లిన తండ్రి మరణించిన వారికి ఏర్పాటు చేసినట్లుగా శ్రద్ధాంజలి ఘటించే ఫ్లెక్సీ ఏర్పాటు చేసి తన కూతురు మరణించిందని పిండ ప్రదానం చేసి శ్రద్ధాంజలి ఘటించారు. అంతటితో ఆగకుండా తమ బంధు మిత్రులు ఉన్న వాట్సప్ గ్రూపులు, ఫేస్ బుక్ ఇతర సోషల్ మీడియాలలో విషయాన్ని షేర్ చేసినట్లు సమాచారం. శ్రద్ధాంజలితో పాటు, యువతీ యువకులు పెళ్లి చేసుకున్న ఫోటోలు సైతం సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తున్నాయి.