- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
market : పొద్దుపొద్దున్నే రోడ్డు పై బైఠాయించి రైతుల ఆందోళన..
దిశ, అలంపూర్ : పొద్దు పొద్దున్నే రైతులు ఆందోళన చేపట్టిన సంఘటన జోగులాంబ గద్వాల ( Jogulamba Gadwala ) జిల్లా అయిజ మున్సిపాలిటిలో చోటుచేసుకుంది. కొత్తగా నిర్మించిన వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ ని వాడుకోవాలని మున్సిపల్ అధికారులు కూరగాయలు ( Vegetables ) తెచ్చే రైతులకు, ఏజెంట్లకు చెప్పారు. అయితే రైతులు, ఏజెంట్లు నూతనంగా నిర్మించిన మార్కెట్లోకి పోవడానికి సంకోచిస్తున్నారు. ఆ మార్కెట్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుందని ఒక వెహికిల్ వెలితే ఇంకొక వెహికిల్ వెళ్లడానికి అవకాశం లేకపోవడం, కరెంటు సౌకర్యం నేటికీ కల్పించకపోవడంతో శనివారం తెల్లవారుజామున రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ నడపాలంటే చాలా ఇబ్బంది అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయిజ పాత బస్టాండ్ లో ఆటోలు నిలిపితే ఎటు పోలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు. నూతనంగా నిర్మించిన ఈ కూరగాయల మార్కెట్ లో సరైన వసతులు కల్పించాలని రైతులు కోరుతున్నారు.
అధికారులు స్పందించి కూరగాయలు పండించే రైతులకు ఏదో ఒక చోట మార్గం చూపించాలని, ఆ వైపు ఆలోచన చేయాలన్నారు. కొత్తగా నిర్మించిన మార్కెట్ యార్డ్ లో ( Market Yard ) వసతులు లేవని, పాత కూరగాయల మార్కెట్ యార్డ్ లోనే కూరగాయలు అమ్ముకునే అవకాశం కల్పించాలి రైతులు డిమాండ్ చేస్తున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు, మున్సిపాలిటీ అధికారులు తరళి రైతులకు ఉన్న సమస్యను సద్దుమనిగే విధంగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళనను విరమించుకున్నారు.