- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాష్ట్రంలో కుటుంబపాలన కొనసాగుతోంది: గోవా మాజీ పీసీసీ అధ్యక్షుడు గిరీష్ చోడొంకర్
దిశ, మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్రంలో కుటుంబపాలన కొనసాగుతోందని గోవా మాజీ పీసీసీ అధ్యక్షుడు, హాథ్ సే హాథ్ జోడో రాష్ట్ర ఇంచార్జి గిరీష్ చోడొంకర్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అబద్ధాల హామీలతో, అంతులేని పన్నులతో, విపరీతంగా ధరలు పెంచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని పీఎం నరేంద్రమోదీ, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్ లు మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు.
దేశంలో బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని, దేశ ప్రజలను ఏకం చేయడం కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాల్లో చేపడుతున్న హాథ్ సే హాథ్ జోడో యాత్ర ద్వారా ప్రజలతో మమేకమవుతున్నట్లు గిరీష్ చోడంకర్ చెప్పారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు జీ.మధుసూదన్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు జగదీశ్వర్ రావు, ప్రదీప్ గౌడ్, వినోద్ కుమార్, సంజీవ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.