Professor Purushottam Reddy : పర్యావరణ సుస్థిర నిర్మాణ అభివృద్ధి జరగాలి..

by Sumithra |
Professor Purushottam Reddy : పర్యావరణ సుస్థిర నిర్మాణ అభివృద్ధి జరగాలి..
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : పకృతి కోపానికి మనమంతా బలి కాకముందే నదులు, అడవులను కాపాడుకొని పర్యావరణ సుస్థిర నిర్మాణ అభివృద్ధి జరుపుకోవాలని ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో మంగళవారం ఎన్టీఆర్ ఫిల్మ్ క్లబ్, ఎకో క్లబ్, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ స్టడీస్, '8 వ బాబుల్ ఎకో ఫిల్మ్ ఫెస్టివల్' ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జ్యూరీ చైర్మెన్, న్యాయవాది మల్లారెడ్డి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఇప్పుడు ఉన్న చట్టాలు సరిపోవని, మరింత కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉందన్నారు.

డాక్టర్ రాంకిషన్ మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో మానవులు భూమిని కొల్లగొడుతున్నారని, తినే ఆహారం, గాలి, నీళ్ళ మీద పెద్ద కంపెనీలు వ్యాపారం చేస్తున్నాయని విమర్శించారు. పియూ ఓఎస్డీ కం వీసీ డా.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి పై మనిషికి ఎంత అధికారం ఉందో చీమకు కూడా అంతే అధికారం ఉందని, ప్రకృతి తల్లి లాంటిదని దానిని మనమే కాపాడుకోవాలని సూచించారు. ప్రిన్సిపల్ కెప్టెన్ డాక్టర్ విజయకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ అంశాలకు సంబంధించిన 18 షార్ట్ ఫిల్మ్స్, 12 గ్రీన్ ఫిల్మ్స్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ పాండే, డైరెక్టర్స్ డానియల్ లిర్, జూలియన్, వైస్ ప్రిన్సిపాల్ అమీనా ముంతాజ్, ఎన్టీఆర్ ఫిల్మ్ క్లబ్ కన్వీనర్ డాక్టర్.ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed