- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
10 నెలలుగా పస్తులు.. జీతాలు ఇవ్వాలంటూ గంటపాటు ఆందోళన..
దిశ, మానోపాడు : పది నెలలుగా పస్తులు ఉంటూ రోడ్డున పడ్డామని ఓ కంపెనీ ముందు ఉద్యోగస్తులందరూ ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేయాలంటూ గంటపాటులో ధర్నాచేపట్టారు. పూర్తివివరాల ప్రకారం జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని కల్కుంట్ల గ్రామంలో నది బయోటెక్ కంపెనీ గత 15 సంవత్సరాలుగా కొనసాగుతుంది. అందులో సుమారు 120 మంది ఉద్యోగస్తులు, 100 మందికి పైగా కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. గత పది నెలలుగా ఆ కంపెనీ యాజమాన్యం జీతాలు చెల్లించడం లేదు. దీంతో ఏమి చేయాలో తోచక.. ఎవరికి చెప్పుకున్న సమస్య తీరకపోవడంతో గురువారం ఉద్యోగస్తులు, కార్మికులు కంపెనీ ముందు ఆందోళన నిర్వహించారు.
తమ కుటుంబాలు జీతాలు లేక రోడ్డునపడ్డ యాజమాన్యం మాత్రం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ యాజమాన్యం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సంఘటన స్థలానికి శాంతినగర్ ఎస్సై, కంపెనీ యాజమాన్యంకు సంబంధించిన వ్యక్తులు ముందుకు వచ్చి వారిని నచ్చచెప్పారు. ఈనెల 15 వరకు సమయం కావాలని కంపెనీలో ముగ్గురు ఓనర్స్ పార్ట్నషిప్ ఉన్నారని వారితో ఒకసారి చర్చించి మీ సమస్యను తొలితగతంగా తీర్చుతామని హామీ ఇచ్చారు. దీంతో ఉద్యోగస్తులందరూ ధర్నా విరమిచ్చుకున్నారు. ఈనెల 15న స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని ఉద్యోగస్తులు కార్మికులు మరోసారి హెచ్చరించారు.