జెన్కో ఉద్యోగుల నిరసన... ప్రభుత్వంపై ఫైర్

by S Gopi |
జెన్కో ఉద్యోగుల నిరసన... ప్రభుత్వంపై ఫైర్
X

దిశ, అచ్చంపేట: తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల(2022) పీఆర్సీ బకాయిలను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం టీఎస్ జెన్కో ఎస్ఎల్బీసీ హెచ్ ఈఎస్ ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నాయకులు అనిల్, లవ కుమార్ తదితరులు మాట్లాడుతూ.. ప్రభుత్వం 2022 పీఆర్సీ అమలు చేస్తామని చెప్పి కాలయాపన చేయడం సరైనది కాదని, తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో భవిష్యత్తు పోరాట కార్యక్రమాన్ని విడుదలవారీగా చేపడుతామని, పీఆర్సీ అమలు చేసే వరకు ఆందోళన క్రమక్రమంగా నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం తెలంగాణ శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో మరియు ఈగలపెంట వద్ద ఉన్న ప్రధాన కార్యాలయం వద్ద ఉద్యోగులు, కార్మికులు నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో సునీల్, యాదయ్య, బిక్కులాల్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed