ఫార్మా కంపెనీ తొలగించండి..

by Sumithra |
ఫార్మా కంపెనీ తొలగించండి..
X

దిశ, మహమ్మదాబాద్ ; పర్యావరణ కాలుష్యానికి హాని చేసే ఫార్మా కంపెనీని తరిమికొడదాం పచ్చని మన గ్రామాన్ని కాపాడుకుందాం అని మహిళలు వివిధ గ్రామాల ప్రజలు అన్నారు. గురువారం ఐదోవరోజు దేశాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నంచర్ల ఎక్స్ రోడ్ లో వివిధ గ్రామాల ప్రజలు, మహిళలు, దేశాయిపల్లి గ్రామస్తులు, యువకులు అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.

ఫార్మా కంపెనీ తొలగించకుంటే భారీ ఎత్తున ఆందోళన చేపడుతామని మా ప్రాణాలైనా ప్రాణంగా పెడతామని చుట్టుపక్కల గ్రామస్తులు తెలియజేశారు. ఇదే విధంగా ఉంటే చుట్టుపక్కల గ్రామాలకు కాలుష్యం ఏర్పడి రోగాలం బారిన పడే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించగలరని వివిధ గ్రామాల ప్రజలు కోరారు.

Advertisement

Next Story