MLA Yennam Srinivas Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకే మొదటి ప్రాధాన్యత..

by Sumithra |
MLA Yennam Srinivas Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకే మొదటి ప్రాధాన్యత..
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకే మొదటి ప్రాధాన్యతను ఇస్తూ, సువర్ణాధ్యాయాన్ని మొదలు పెట్టిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక అన్నపూర్ణ గార్డెన్స్ లో ఉపాధ్యాయుల పదన్నోతులు, బదిలీలు జరిపినందుకు కృతజ్ఞతగా టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గాల్ రెడ్డి హర్షవర్థన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన 'ప్రభుత్వానికి కృతజ్ఞత సభ'ను ఆయన దేవరకద్ర, మక్తల్ ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్ లతో కలిసి ప్రారంభించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రసంగించారు. మార్పుకోరి ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని తెచ్చారని, ప్రజల ఆకాంక్ష మేరకే ముఖ్యమంత్రి మొదలుకొని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తి స్థాయిలో ఎవరి ప్రమేయం లేకుండా స్వేచ్ఛగా పనిచేసుకుంటున్నారని ఆయన అన్నారు.

సీఎం ఆదేశాల మేరకు మొన్న జరిగిన ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు ఎవరి ప్రమేయం లేకుండా పారదర్శకంగా జరిగాయని ఆయన ప్రశంసించారు. పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగ, ఉపాధ్యాయులు అణచివేతకు గురై, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కోల్పోయి, నియంతృత్వ పాలన కొనసాగించారని ఆయన తీవ్రంగా విమర్శించారు. నాయకుడు అనేవాడు హర్షవర్థన్ లాగా ఉండాలని, నాయకత్వం కోసం కాకుండా ఉపాధ్యాయుల సమస్యలు కోసం ఉద్భవించిన కిరణం లాంటివాడని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ ఆనంద్ గౌడ్ డీఈఓ రవీందర్, గద్వాల మాజీ జడ్పీ చైర్మెన్ సరిత, శ్యాంబాబు, రాజేందర్ రెడ్డి, గట్టు వెంకట్ రెడ్డి, దూకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story