విద్యతోనే విద్యార్థులకు భవిష్యత్​

by Sridhar Babu |
విద్యతోనే విద్యార్థులకు భవిష్యత్​
X

దిశ, కొల్లాపూర్ : విద్యతోనే విద్యార్థులకు భవిష్యత్​ ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. పాఠశాలల అభివృద్ధి కోసం తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని రాణి ఇందిరా దేవి ప్రభుత్వ పాఠశాల మరమ్మతు పనులను మంత్రి జూపల్లి పరిశీలించారు. కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని రాణి ఇందిరా దేవి పాఠశాలలో మరమ్మతు​ పనులు చేయడానికి మంత్రి నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో పాఠశాల అభివృద్దికి ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తానని, విద్యతోనే విద్యార్థుల భవిష్యత్తు ముడిపడి ఉందని స్పష్టం చేశారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించేలా కృషి చేస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story