- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒమిక్రాన్‌పై ఆందోళన వద్దు.. డీఎంహెచ్‌ఓ సుధాకర్ లాల్ సూచన
దిశ, కల్వకుర్తి: కల్వకుర్తి పట్టణ పరిధిలోని అక్షరవనంలో 8 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.సుధాకర్ లాల్ వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా సుధాకర్ లాల్ మాట్లాడుతూ.. కరోనా పేషెంట్లకు వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటారని, వారి సూచనలు పాటిస్తూ కొవిడ్‌ను జయించాలని అన్నారు. ఏ విధమైన ఇబ్బంది అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని, అనవసరంగా ఆందోళన చెందొద్దన్నారు. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని, అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయని, ఏ ఒక్కరూ అధైర్య పడొద్దని సూచించారు. ప్రతిఒక్కరూ విధిగా మాస్కులు ధరిస్తూ, భౌతికదూరం పాటించాలని కోరారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో ఇంటింటి ఆరోగ్య సర్వే కార్యక్రమాన్ని పక్కాగా చేపట్టారు. తిలక్‌నగర్‌లో వైద్య సిబ్బంది నిర్వహిస్తున్న ఇంటింటి ఫీవర్ సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేసి, వైద్య సిబ్బంది పని తీరును పరిశీలించారు. ప్రజలు వైద్య సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ నట్రాజు, డాక్య బలరాం, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.