- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ది.. డీకే అరుణ
దిశ, గద్వాల ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి జరుగుతోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కావాలనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించడం లేదని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించాలని బీజేపీ కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. ప్రజా గోసం బీజేపీ భరోసా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బీజేపీ కార్యకర్తలు, నాయకులను అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో డీకే అరుణ తన నివాసంలో సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. శక్తి కేంద్ర ఇన్ చార్జిలు, కార్యకర్తలు ఈ కార్నర్ సమావేశాలు విజయవంతం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి చెందుతుందని, కేంద్ర ప్రభుత్వం వేలకోట్ల రూపాయలతో తెలంగాణ రోడ్లకు ఖర్చు చేస్తుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి రాయచూర్ నుండి గద్వాల మీదుగా ఎర్రవల్లి వరకు నేషనల్ హైవే కలపాలని వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, దీనివల్ల నేషనల్ హైవే కావడంతో విద్యా , వ్యాపారాలు ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందుతాయని అన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఆమె అన్నారు. సిలిండర్ పై 300 రూపాయలు పైగా తెలంగాణ ప్రభుత్వం టాక్స్ వేస్తుందన్న ఆమె..తెలంగాణలో లిక్కర్ ద్వారా 40 వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకున్నారని బీఆర్ఎస్ నాయుకులపై విరుచుకుపడింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కృష్ణారెడ్డి , పట్టణ అధ్యక్షుడు బండల వెంకట రాములు, జిల్లా బీజెవైఎం అధ్యక్షుడు మీర్జాపురం వెంకటేశ్వర్ రెడ్డి, మండల అధ్యక్షులు బలి గేర శివారెడ్డి ,రాజేష్ అయ్య శ్రీనివాస్ గౌడ్, మహానంది రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, అసెంబ్లీ కో కన్వీనర్ శ్యామ్ బీజేపీ ఫుల్ టైమర్ మురేందర్ రాజు, తదితరులు పాల్గొన్నారు.