- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేటి నుంచి డిజిటల్ కార్డుల సర్వే షురూ.. పైలెట్ ప్రాజెక్టుగా ఉమ్మడి జిల్లా ఎంపిక
దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో: కుటుంబ సభ్యుల వివరాల సేకరణ, డిజిటల్ కార్డుల జారీ కోసం గురువారం నుంచి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక కాబడిన ఆయా మండలాల్లోని పంచాయతీలు, మునిసిపాలిటీల్లో సర్వేలు కొనసాగనున్నాయి. ఈ సర్వేలకు సంబంధించి జిల్లా కేంద్రాల్లోని అధికారులు, సిబ్బందికి కలెక్టర్ల సమక్షంలో అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల పరిధిలోని 12 గ్రామ పంచాయతీలు, 8 వార్డులను ఎంపిక చేశారు. ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల వార్డుల్లో ఉన్న జనాభాను బట్టి 2 నుంచి 6 వరకు బృందాలను ఏర్పాటు చేసి వివరాలను సేకరించనున్నారు. ఒక ఇంట్లో ప్రతి ఒక్కరి పేరు, వయస్సు, ఫొటోలు, వేరువేరుగా తీసుకోవడంతో పాటు అందరి సభ్యులను కలిపి మరో ఫొటోను కూడా తీసుకుంటారా.. లేక మొదటగా ఆయా గృహాల్లో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తారా అన్న విషయంపై గురువారం ఉదయం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
పైలట్ ప్రాజెక్టు కింద..
పైలట్ ప్రాజెక్టు కింద ఆయా జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల వివరాలు కుటుంబ సభ్యుల వివరాల సేకరణ కోసం జిల్లాలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక మండలంలోని పంచాయతీ, మునిసిపాలిటీ పరిధిలోని ఒక వార్డును ఎంపిక చేశారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో హన్వాడ మండలంలోని మాదారం, జడ్చర్ల మండలంలోని అల్వాన్పల్లి, చిన్నచింతకుంట మండలంలోని సీతారాంపేట, మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలోని 37వ వార్డు, జడ్చర్లలో 24వ వార్డు, భూత్పూర్‌లోని 9వ వార్డును పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. నారాయణపేట జిల్లాలో దామరగిద్ద మండలంలోని అయ్యవారిపల్లె, కోస్గి మండలంలోని ముక్తిపాడు, ఊట్కూరు మండలంలోని కొత్తపల్లి, నారాయణపేట మున్సిపాలిటీలోని 15వ వార్డును ఎంపిక చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్ మండలంలోని ర్యాలంపాడు, కేటి దొడ్డి మండలంలోని మైలగడ్డ, ఐజా మున్సిపాలిటీలోని 3వ వార్డు, గద్వాల మున్సిపాలిటీలో 9వ వార్డును ఎంపిక చేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలో బిజినపల్లి మండలం బోయాపూర్, అచ్చంపేట మండలంలోని బ్రాహ్మణపల్లి, పెద్ద కొత్తపల్లి మండలంలోని దేవినేని పల్లి, కల్వకుర్తి మున్సిపాలిటీలోని 10వ వార్డును ఎంపిక చేశారు. ఇక వనపర్తి జిల్లాలో అంజనగిరి గ్రామ పంచాయతీ, వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 10 వార్డును పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు.
వివరాల సేకరణపై రాని క్లారిటీ
డిజిటల్ కార్డుల సర్వే గురువారం నుంచి ఈ నెల 7 వరకు ఐదు రోజుల పాటు జరగనున్నప్పటికీ కుటుంబాలకు సంబంధించి ఎలాంటి వివరాలు సేకరించాలి అనే అంశంపై బుధవారం రాత్రి వరకు అధికారులకు సమాచారం అందలేదు. ఇంటి నెంబర్, ఆ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటున్నారని అనే విషయాన్ని నోట్ చేసుకుంటారు. అదేవిధంగా సభ్యుల వయస్సు, ఆధార్ వివరాలు, వ్యక్తిగత ఫొటోలు, కుటుంబ సభ్యులను అందరిని కలిపి ఫోటోలు తీసి కుటుంబాల వారీగా డిజిటల్ కార్డులను అందజేసే అవకాశం ఉన్నట్లుగా ఓ అధికారి పేర్కొన్నారు. ఈ కార్డులతో రాబోయే ప్రభుత్వ పథకాలు, తదితర వివరాలకు ఎంతగానో దోహదపడుతాయని అధికారులు తెలిపారు.