- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవినీతి, కుంభకోణాలకు నిలువెత్తు నిదర్శనం కాంగ్రెస్ పార్టీ : ఎమ్మెల్యే
దిశ, కల్వకుర్తి : అవినీతి, కుంభకోణాలకు నిలువెత్తు నిదర్శనం కాంగ్రెస్ పార్టీ అని కల్వకుర్తి శాసన సభ్యులు జైపాల్ యాదవ్ అన్నారు. గురువారం కల్వకుర్తి పట్టణంలోని ఆయన నివాస గృహంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ.. బుధవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు కల్వకుర్తి మండల పరిధిలోని జిల్లెల గ్రామ తండాలో చంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించడం శోచనీయమన్నారు. 3 సంవత్సరాల క్రితం చంద్రయ్య క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ఇప్పుడు పరామర్శించడం ఏంటని ప్రశ్నించారు.
గతంలోనే మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచి రైతు బంధు, రైతు బీమా ద్వారా వచ్చిన 5 లక్షలను వారి కుటుంబానికి అందేలా చేశామన్నారు. చిల్లర రాజకీయాలు చేయడం కాంగ్రెస్ నాయకుల అవివేకానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పరిపాలనలో రైతుబంధు, రైతుభీమా, 24 గంటల కరెంటు లేదన్నారు. 60 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసి అవినీతి, కుంభకోణాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీజేపీ సిద్ధాంతాలు సాంప్రదాయాలు పాటించరని, ప్రజా సంక్షేమం పాటుపడే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ప్రజలు బీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు దిక్కు తోచక కుట్రలకు పాల్పడుతున్నారన్నారు.
రైతులంతా పార్టీలంతా పార్టీలకు అతీతంగా ఆలోచించి కాంగ్రెస్ నాయకుల కుట్ర, కుతంత్రాలను గమనించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికలలో తరిమి కొట్టాలన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ నిరంతరం రైతన్న కోసమే పాటు పడుతూ.. 60 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని కేవలం తొమ్మిదేళ్లలొనే చేసి చూపించిన బీఆర్‌ఎస్‌కు రైతులు, ప్రజలు అండగా ఉండాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, మార్కెట్ చైర్మన్ విజయ్ గౌడ్,వైస్ ఎంపీపీ గోవర్ధన్,కౌన్సిలర్ సూర్య ప్రకాష్ రావు, జిల్లెల గ్రామ సర్పంచ్ జంగయ్య , కార్యకర్తలు పాల్గొన్నారు.