పాకిస్తాన్ ఏర్పాటుకు కృషి చేసిందే కాంగ్రెస్.. : మురళీధర్ రావు

by Disha Web Desk 23 |
పాకిస్తాన్ ఏర్పాటుకు కృషి చేసిందే కాంగ్రెస్.. : మురళీధర్ రావు
X

దిశ,నారాయణపేట ప్రతినిధి: రిజర్వేషన్లు పుష్కలంగా ఉంటాయని, రిజర్వేషన్లపై కాంగ్రెస్ అనవసరపు రాద్ధాంతం చేస్తుందని,పాకిస్తాన్ ఏర్పాటుకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమైందని, ఈశాన్య రాష్ట్రాల్లో ఒకప్పుడు ఉగ్రవాదం ఉండేదని, ప్రస్తుతం ఉగ్రవాద రహిత దేశంగా భారతదేశం ముందుకు సాగుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పది సంవత్సరాల్లోనే దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ అవతరించిందని,. సొంత మెజార్టీతో రెండు పర్యాయాలు మోడీ ప్రధానమంత్రి అయ్యాడని,మూడోసారి కూడా నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యమన్నారు.

అమెరికా, చైనా, తర్వాత మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత భారత దేశం మారిందన్నారు. లక్షలాది కుంభకోణాల నుంచి దేశాన్ని బయటకు తీసుకువచ్చి మచ్చలేని పార్టీగా బీజేపీ కేంద్రంలో ముందుకు సాగుతుందన్నారు. కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించింది కాంగ్రెస్ అని... దేశంలోని ప్రజలను కులాల ఆధారంగా విభజించి కాంగ్రెస్ ఆనాడు పాలించిందన్నారు. దేశంలో ఇప్పటివరకు సుమారు 280 స్థానాల్లో ఎంపీ ఎన్నికలు పూర్తయ్యాయని ఇంకా దేశ సగభాగంలో ఎన్నికలు జరగాల్సి ఉందన్నారు. మే 10వ తేదీన నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగే ఎన్నికల ప్రచార సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, బంగారు శృతి, నాగు రావు నామాజీ, డోకూరు పవన్ కుమార్ రెడ్డి, ఎగ్గని నర్సింహులు, రతంగ పాండు రెడ్డి, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed