- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆప్ అంతానికే బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’ : కేజ్రీవాల్
దిశ, నేషనల్ బ్యూరో : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు ‘ఆపరేషన్ ఝాడు’ను బీజేపీ మొదలుపెట్టిందని ఆమ్‌ఆద్మీపార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్‌ను బీజేపీ ముప్పుగా భావిస్తోందని ఆయన చెప్పారు. ‘ఆపరేషన్ ఝాడు’లో భాగంగానే ఆప్ నేతల అరెస్టులు, పార్టీ బ్యాంకు అకౌంట్లను సీజ్ చేయడం, ఆప్ కార్యాలయాలను మూసివేయించడం వంటివి చేయనున్నారని పేర్కొన్నారు. ఆప్ నేతల ఆరెస్టులకు నిరసనగా ఆదివారం మధ్యాహ్నం బీజేపీ కార్యాలయం వద్ద ‘జైల్ భరో’ నిరసన కార్యక్రమానికి బయలుదేరడానికి ముందు నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆప్ ఎదుగుదలపై ప్రధాని మోడీ ఆందోళన చెందుతున్నారు. మా పార్టీ చాలా వేగంగా అభివృద్ది చెందింది. ఆప్‌ను అణిచివేసేందుకే ఆపరేషన్ ఝాడును బీజేపీ ప్రారంభించింది. రానున్న కాలంలో మా నేతలను అరెస్ట్ చేస్తారు. బీజేపీకి ఆప్ పెద్ద సవాల్‌గా మారుకుండా ఉండేందుకు భవిష్యత్తులో మా బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తారు. పార్టీ కార్యాలయాన్ని మూసి వేసి వీధుల్లోకి తీసుకొస్తారు. మున్ముందు మనకు పెద్ద సవాళ్లు ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండండి’’ అని ఆప్ శ్రేణులకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.
రోడ్డుపైనే బైఠాయించిన సీఎం
బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కేజ్రీవాల్ తన పార్టీ కార్యకర్తలతో సహా బయలుదేరారు. ఈ సమయంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆప్ కార్యాలయం ఎదుట ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బైఠాయించి నిరసన చేపట్టారు. ఫలితంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు డీడీయూ మార్గ్‌లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఐటీవో మెట్రో స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.అయినా బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు చేరుకున్న పలువురు ఆప్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుణ్ని కాపాడేందుకు వీధుల్లోకి వస్తున్నామా? : స్వాతి మలివాల్
ఆమ్ ఆద్మీ పార్టీ తలపెట్టిన నిరసనపై ట్విట్టర్ వేదికగా ఎంపీ స్వాతి మలివాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒకప్పుడు నిర్భయకు న్యాయం చేయాలని మనమంతా వీధుల్లోకి వచ్చాం. 12 ఏళ్ల తర్వాత ఈరోజు సీసీటీవీ ఫుటేజీని మాయం చేసి, ఫోన్‌ను ఫార్మాట్ చేసిన నిందితుణ్ని కాపాడేందుకు వీధుల్లోకి వస్తున్నామా? ఈ మాత్రం చొరవ మనీశ్ సిసోడియా విషయంలో చూపి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి. ఆయనే బయట ఉంటే ఈరోజు నాకు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు’’ అని మలివాల్ పేర్కొన్నారు.