- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Viral video : అందమైన యువతితో అతని పెళ్లి.. ఆ తర్వాత సీన్ మాత్రం..!

దిశ, ఫీచర్స్ : ఏఐ టెక్నాలజీ (AI technology) ఎన్ని అద్భుతాలు చేస్తున్నదో తెలిసిందే. ఇది అందుబాటులోకి వచ్చాక అనేక రంగాల్లో సేవలు, పనులు సులభతరం అవుతున్నాయి. గంటల కొద్దీ మానవ శ్రమ అవసరమైన పనిని సైతం.. క్షణాల్లో చేసి పెడుతూ అబ్బుర పరుస్తోంది ఈ ఆధునిక సాంకేతికత. అలాంటి వాటిలో ఏఐ ఆధారిత రోబోట్స్ ఒకటి. ఆయా పనులను చకచకా చేసి పెడుతున్న ఏఐ ఆధారిత హ్యూమనాయిడ్ రోబోట్స్ (AI-based humanoid robots) వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. నెటిజన్లను ఆకట్టుకోవడమే కాకుండా, టెక్నాలజీ పట్ల అవగాహనను పెంపొందిస్తున్నాయి. భవిష్యత్‌లో వాటి అవసరాలను తెలియజేస్తున్నాయి. ఇక వంట చేయడం, సప్లయ్ చేయడం, ఇల్లు సర్దడం, బట్టలు ఉతకడం వంటి పనులు చేయగల రోబోట్స్ కూడా ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. విస్తృతంగా వాడుకలోకి రాలేదు. కానీ మానవ శృంగార కోరికలు తీర్చగల రోబోట్స్ కూడా అందుబాటులో ఉన్నాయంటున్నారు నిపుణులు.
*భవిష్యత్‌లో మాన సంబంధాల్లో, వ్యక్తిగత అంశాల్లో, భావోద్వేగాల్లో సైతం ఒక మనిషికి, మరో మనిషి మాత్రమే తీర్చగల అవసరాలను రాబోయే కాలంలో ఏఐ ఆధారిత హ్యూమనాయిడ్ రోబోట్స్ భర్తీ చేస్తాయని నిపుణులు అంటున్నారు. అచ్చం అలాంటి దృశ్యాన్ని కళ్లకు కట్టే వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ఒక వ్యక్తి అందమైన అమ్మాయిని చూస్తాడు. ఆమెనే తన గర్ల్ ఫ్రెండ్ (Girlfriend)అని ఫిక్స్ అయిపోతాడు. ప్రేమలో పడిపోతాడు. ఆమెతో మాట్లాడుతూ.. ఆమెను టచ్ చేస్తూ.. ఆనంద పారవశ్యంలో తేలియాడుతుంటాడు. తర్వాత పెళ్లి చేసుకుంటాడు.
*ఇంకేముంది పెళ్లి తర్వాత సీన్.. క్షణాల్లో జరిగిపోతుంది. ముద్దూ ముచ్చట అయిపోతాయి. ఆ తర్వాత యువతి గర్భం దాలుస్తుంది. చూస్తుండగానే నెలలు నిండుతాయి. డెలివరీ కోసం ఆప్పత్రిలో జాయిన్ చేస్తారు. ఇద్దరు అందమైన కవలలకు జన్మనిస్తుంది ఆ యువతి. ఇది చూసిన డాక్టర్లు ముసి ముసి నవ్వుతూ కంగ్రాట్స్ చెప్తుంటారు. సంతానాన్ని చూసి ఆ తల్లి ఆనందంతో పొంగిపోతుంది. ఇదంతా మనిషి జీవితంలో సాధారణమే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది..! ఏంటంటే.. ఆ యువతి నిజమైన మనిషి కాదు, అందమైన మనిషి రూపంలో ఉన్న ఏఐ ఆధారిత ఉమన్ రోబోట్(AI-based female robot).. కానీ అచ్చం మనిషిలాగే ప్రవర్తించి, మనిషిలా మారి, మధురానుభూతికి లోను చేసిందా దృశ్యం. అందుకేనేమో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఫిదా చేసేస్తోంది.
*ఏఐ ఆధారిత రోబోటిక్ (AI-based robotics) యువతితో ఓ యువకుడి పెళ్లి.. చూడ్డానికి వైరల్ వీడియోనే కావచ్చు. ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ అది ఆధునిక సాంకేతికత తెచ్చిన గొప్ప మార్పు. భవిష్యత్‌లో దాని ప్రాధాన్యతను కళ్లకు కడుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు కొన్ని విషయాల్లోనే టెక్నాలజీ మానవులు లేని లోటును తీర్చగలదని భావిస్తున్నాం. కానీ రాబోయే దశాబ్దాల్లో అందుకు భిన్నమైన ప్రపంచం ఆవిష్కరించే అవకాశాలున్నాయి అంటున్నారు సాంకేతిక నిపుణులు. ముఖ్యంగా ప్రేమ, భావోద్వేగాలు, మానవ సంబంధాలు, శృంగారం (Love, emotions, human relationships, romance) వంటి అనేక విషయాల్లో ఏఐ ఆధారిత హ్యుమనాయిడ్ రోబోల్స్ కీ రోల్ పోషిస్తాయి. ఒక మనిషికి మరో మనిషి తోడు అవసరం లేని లోటును కూడా భర్తీ చేస్తాయి. అందుకు తాజా వైరల్ వీడియోనే నిదర్శనం అంటున్నారు నిపుణులు. ఇంకెందుకాలస్యం అదేంటో మీరూ ఓ లుక్కేయండి!
video credits go to @aismartzone Insta id