- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నేరుగా ఇంటి మీద కూలిన విమానం

దిశ, వెబ్ డెస్క్: ప్రయాణికులతో వెళ్తున్న మినీ విమానం (mini plane).. ఓ నివాసంపై పడిపోయింది. ఈ మిన్నియాపాలిస్ సమీపంలోని బ్రూక్లిన్ పార్క్ (Brooklyn Park) అనే నగరంలో చోటుచేసుకుంది. కాగా ఈ ప్రమాదం.. శనివారం సాయంత్రం చోటు చేసుకొగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అలాగే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోలో మినీ విమానం.. ఇంటిపై పడిపోయిన వెంటనే మంటలు వ్యాప్తి చెందడం స్పష్టంగా కనిపించింది. ఈ విమానం SOCATA TBM7 అనే ఒకే ఇంజన్‌తో నడిచే వ్యాపార విమానం, ఇది ఐవోవాలోని డెస్ మోయిన్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరి మిన్నియాపాలిస్‌లోని అనోకా కౌంటీ-బ్లెయిన్ విమానాశ్రయం వైపు వెళుతోంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. విమానంలో ఉన్న వారిలో ఎవరూ బతకలేదని బ్రూక్లిన్ పార్క్ ఫైర్ చీఫ్ షాన్ కాన్వే తెలిపారు. విమానంలో ఎంతమంది ఉన్నారనేదానిపై స్పష్టత లేదు. కానీ కనీసం ఒక మరణం నిర్ధారించబడింది. ఇంట్లో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. విమానం ఇంటిపై కూలడంతో ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. అలాగే సమీప ఇళ్లకు నష్టం జరిగింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) ఈ ప్రమాదాన్ని దర్యాప్తు చేస్తున్నాయి. మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ ఈ ఘటనను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు, కానీ దర్యాప్తు కొనసాగుతోంది.