ఈ పరిస్థితుల్లో సరికాదు.. సీఎం జగన్‌పై జేడీ లక్ష్మీనారాయణ ఫైర్

by srinivas |
ఈ పరిస్థితుల్లో సరికాదు.. సీఎం జగన్‌పై జేడీ లక్ష్మీనారాయణ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పల్నాడు, అనంతపురం, చిత్తూరు, తదితర ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ కార్యకర్తల ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో రాష్ట్రం ఒక్కసారిగా అట్టుడికిపోయింది. దీంతో ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. సిట్ ఏర్పాటు చేసింది. అల్లర్ల ఘటనపై విచారణ జరుగుతోంది. ఈ సమయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి లండన్ టూర్ వెళ్లడాన్ని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తప్పుబట్టారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి, మంత్రులపై ఉంటుందన్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం టూర్ వెళ్లడం సరికాదని సూచించారు. రాష్ట్రంలో జరిగిన దాడులపై ఈసీకి ఫిర్యాదు చేయడం తప్ప.. ఇలాంటివి చేయొద్దని ఏ పార్టీ కూడా తమ కేడర్‌కు చెప్పలేదని మండిపడ్డారు. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు సీఎం ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 144 సెక్షన్ సక్రమంగా అమలు కావడంలేదని చెప్పారు. సిట్ త్వరగా దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఏపార్టీవారైనా సరే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అప్పుడే చట్టం పని చేస్తోందని నమ్మకం కలుగుతుందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

Advertisement

Next Story