- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట : ఎమ్మెల్యే మెగారెడ్డి..
దిశ, పెద్దమందడి : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే మెగా రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దమందడి మండలంలోని మంగంపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి, అంగన్వాడి భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలలో నూతన గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడి కేంద్రాలు, పొలం బాటలు, వ్యవసాయానికి అనుకూలమైన పాంపాండ్లు, వర్మీ కంపోస్ట్ పిట్ల నిర్మాణం, సీసీ రోడ్లు, నర్సరీ అభివృద్ధి, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని వివరించారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ పథకాలు గ్రామీణ రైతులకు, గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే, అధికార బృందం మంగంపల్లి సమీపంలో నూతనంగా నిర్మించిన చెక్‌డ్యామ్‌ను పరిశీలించారు. ఈ చెక్‌డ్యామ్ ద్వారా పొలాలకు తాగునీరు అందుబాటులోకి రావడంతో పాటు రైతులకు నీటి వనరులు మెరుగవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ మల్లయ్య, ఆర్డీఎపీడీ ఉమాదేవి, వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, పెద్దమందడి ఎంపీడీవో, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.