- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Congress government : రైతు గురించి ఆలోచించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్..
దిశ, మదనాపురం : రైతు గురించి ఆలోచించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. మండలంలోని కురుమూర్తిరాయ ఎత్తిపోతల పథకం నుంచి బుధవారం ఎమ్మెల్యే జీఎంఆర్ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలు జూరాల డ్యామ్ నుండి రామన్ ప్రాజెక్టు రావడంతో సమృద్ధిగా నీరు చేరుకున్నావని తెలిపారు. గత మూడు నెలల నుంచి మోటర్లు బాగా చేయించారన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నెల ముందుగానే రుణమాఫీ అమలు చేస్తున్నందున ఈ పథకం మొదటి విడతలో లక్ష రూపాయలు మూడో విడత నాలుగో విడతగా 2 లక్షలు రుణాలను మాఫీ చేశారన్నారు. అన్నం పెట్టే రైతులను అప్పుల ఊబి నుంచి ఆశల సాగు వైపు నడిపించేందుకే ఈ రైతు రుణమాఫీ పథకం అమలు చేయడం జరిగిందని, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలన్నదే కాంగ్రెస్ పార్టీ కోరిక అని తెలిపారు. ఇది తెలంగాణ చరిత్రలో రైతు సంక్షేమ అధ్యయనంగా నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో కురుమూర్తి రాయ ఎత్తిపోతల చైర్మన్ రాజవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గోపి స్వామి, మహేందర్, కరాటే శీను, సత్యనారాయణ గౌడ్, శేఖర్, మనీ వర్ధన్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.