- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జడ్చర్ల ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్ ను కాంగ్రెస్, బీజేపీలు ఓర్వలేక పోతున్నాయి : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
దిశ, జడ్చర్ల : జడ్చర్ల పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు స్వచ్ఛందంగా వేలాదిగా తరలివచ్చి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు మద్దతు తెలిపారని, అనుకున్న దానికంటే రెట్టింపు స్థాయిలో బహిరంగ సభకు ప్రజలు హాజరై బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపారని, ఈ విషయాన్ని కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు జీర్ణించుకోలేక అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం జడ్చర్ల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఈనెల 18న జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలు మూడు గంటల పాటు కూర్చోవడం చూస్తుంటే ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారన్న సంకేతం ఇచ్చారని అన్నారు.
ప్రజా ఆశీర్వాద సభను ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, గత 50 ఏళ్ల నుంచి చేయని అభివృద్ధిని గత పది సంవత్సరాల్లో నియోజకవర్గంలో చేసి చూపించానని తాను చేసిన అభివృద్ధి పనులు ప్రతిపక్ష నాయకులకు కనబడడం లేదని ప్రశ్నించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జడ్చర్ల లో ఏదో ఒక సమస్యపై వార్తలు వచ్చేవని కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఎలాంటి సమస్యల మీద వార్తలు రావడం లేదంటే తము ఏ విధంగా అభివృద్ధి చేశామో ప్రజలు గ్రహించాలన్నారు.
జడ్చర్ల పట్టణంలో 90 శాతం పనులు పూర్తయ్యాయని అక్కడక్కడ కొన్ని చోట్ల చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి. అవి కూడా త్వరలోనే పూర్తి చేసి జడ్చర్లను మరింత అందంగా తీర్చిదిద్దుతామన్నారు. గతంలో మంత్రులుగా పనిచేసి కూడా అభివృద్ధి పనులు అంటే తెలియని వారు ఈరోజు జడ్చర్ల లో అభివృద్ధి పనులు జరగలేదని ఆరోపిస్తున్నారని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని మాజీమంత్రి చిత్తరంజన్ దాస్ ను ఉద్దేశించి లక్ష్మారెడ్డి అన్నారు. గతంలో అభివృద్ధి అంటేనే ఏమిటో తెలియదా తాను చేసిన అభివృద్ధి చూసి ఇక్కడ ప్రజలు తనను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని లక్ష్మారెడ్డి అన్నారు.
రాష్ట్ర అభివృద్ధి నియోజక అభివృద్ధి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందనే నమ్మకం ప్రజల్లో ఉందని కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు బ్రమలో ఉండి ఏవేవో మాట్లాడుతున్నారని ఏది ఏమైనా రాబోవు ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కొడుగల్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ ధోరేపల్లి లక్ష్మి, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రనిల్ చందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డి, నాయకులు పిట్టల మురళి రాంమోహన్, కౌన్సిలర్లు ఉమా శంకర్ గౌడ్, చైతన్య చౌహన్, కోట్ల ప్రశాంత్ రెడ్డి, రమేష్, దేవా, సత్యం, పుష్పలత, మూడా డైరెక్టర్లు శ్రీకాంత్, ఇంతియా,జ్ శ్రీశైలం, యాదవ్ తదితరులు పాల్గొన్నారు.