- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Collector Vijayendira Boi : మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని సరఫరా చేయండి
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: జిల్లా కేంద్ర సమీపంలోని కోడూరు నుంచి పైప్ లైన్ వేసి మండలం కేంద్రంలోని కస్తూర్బా బాలికా విద్యాలయానికి వెంటనే మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మిషన్ భగీరథ ఎస్ఈ ని ఆదేశించారు. మంగళవారం ఆమె జిల్లా కేంద్ర సమీపంలోని కోడూరు మండల కేంద్రంలోని కేజీబీవీ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆమె 8 వ తరగతి బాలికలతో మాట్లాడుతూ బాలికల ప్రాజెక్ట్ వర్క్,వ్యాసరచన,వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నారా అని తెలుసుకుంటూ,మరింత జ్ఞానాన్ని పెంపొందించేందుకు అన్వేషణలు చేయాలన్నారు.విద్యార్థినిలతో కలిసి భోజనం చేశారు.అనంతరం స్టార్ రూం,పరిసరాలు,వంట గది,పాత్రల శుభ్రత,టాయిలెట్స్ లను పరిశీలించారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి...
ఆగస్టు 15 న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు.మంగళవారం ఆమె జిల్లా ఎస్పీ జానకి తో కలిసి వేడుకలు నిర్వహించే జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం పరేడ్ గ్రౌండ్ ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఆమె వెంబడి అదనపు కలెక్టర్ మోహన్ రావు,ఆర్డీఓ నవీన్,మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి,డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ ఇస్రా తదితరులు ఉన్నారు.