Collector : ముంపు గ్రామాలకు న్యాయం చేస్తాం

by Nagam Mallesh |
Collector : ముంపు గ్రామాలకు న్యాయం చేస్తాం
X

దిశ, మక్తల్: భూత్పూర్ రిజర్వాయ్ ముంపు గ్రామాలకు న్యాయం చేస్తామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో పాటు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కలిసి నియోజకవర్గంలోని నాలుగు నిర్వాసిత గ్రామాలైన భూత్పూర్, అనుగొండ, అంకెన్పల్లి ముష్ఠిపల్లి గ్రామాలను పరిశీలించారు. ఈ సందర్భంగా భూత్పూర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తై సంవత్సారాలు గడిచినా భూత్పుర్ ను పునరావాస కేంద్రంగా ప్రకటించక పోవడం అన్యాయం అని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గ్రామస్థులు కొత్త నివాసాలను నిర్మించు కోలేక, వీరి జీవన విధానం అస్తవ్యస్తంగా తయారైంది ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. మక్తల్ కొడంగల్ నారాయణపేట సాగునీటి ప్రాజెక్టు చేపడితే భూత్పూర్ రిజర్వాయర్ని ఇంకా విస్తరించాల్సి ఉంటుందని.. అప్పుడు భూత్పూర్ నీటి ఊటగా మారుతుందని కలెక్టర్ కు ఎమ్మెల్యే వివరించారు. త్వరగా రిపోర్ట్ తెప్పించుకొని ప్రభుత్వానికి నివేదిక పంపిస్తే.. తాను సంబంధిత మంత్రి, సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి బాధితులకు నష్ట పరిహారం ఇపిస్తానని.. ఎగువ ప్రాంతాలలో స్థలాలు ఇప్పిస్తే ఇళ్ళు నిర్మించుకుంటారని ఎమ్మెల్యే శ్రీహరి కలెక్టర్ కు వివరించారు. అంతకుముందు గ్రామంలోని పాఠశాలోని విద్యార్థులతో మాట్లాడుతూ మెనూ ప్రకారం భోజనం వడ్డిస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు కలెక్టర్. అనంతరం పాఠశాల ఆవరణలో కలేక్టర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశోక్,ఆర్డీఓ, ఇరిగేషన్, రెవెన్యూ అధికార్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed