- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్ మాల రోడ్డు నిర్మాణపు పనులను పరిశీలించిన కలెక్టర్
దిశ, గద్వాల కలెక్టరేట్ : భారత్ మాల రోడ్డు నిర్మాణపు పనులను జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ పరిశీలించారు. మంగళవారం గట్టు మండలంలోని తప్పెట్లమొరుసు, ఆరగిద్ద గ్రామంలో భారత్ మాల నిర్మాణ పనులను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ లక్ష్మినారాయణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా హైవే అథారిటీ అధికారులతో రహదారి నిర్మాణం సంబంధిత భూముల వివరాలను, భారత్ మాల రహదారి మ్యాపింగ్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రహదారి నిర్మాణంలో భాగంగా రైతుల భూములకు సర్వీస్ రోడ్లు, కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన కనెక్టివిటీ అందిస్తామని అన్నారు. నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సరిత రాణి, ఎన్ హెచ్ ఎ ఐ ఇంజనీర్ సురేందర్, సంబంధిత అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.