సీఎం సభను విజయవంతం చేయాలి : శ్రీనివాస్ గౌడ్

by Kalyani |   ( Updated:2023-11-21 16:18:26.0  )
సీఎం సభను విజయవంతం చేయాలి :  శ్రీనివాస్ గౌడ్
X

దిశ,మహబూబ్ నగర్: తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, అందుకు కారకులైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిమిత్తం బుధవారం మహబూబ్ నగర్ వస్తున్న సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలి రావాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్ఠణంలో రోడ్లు ,జంక్షన్ లు, బైపాస్ రోడ్డు, నెక్లెస్ రోడ్డు, ఐటీ టవర్, మన్యంకొండ ఆలయ అభివృద్ధి, ఐలాండ్, మినీ ట్యాంక్ బండ్, నిర్మాణంలోని వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, అమర్ రాజా కంపెనీ, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నామని తెలిపారు.

కారు గుర్తుకే తమ ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మరింత అద్భుతమైన ప్రగతి సాధించుకోవచ్చని ఆయన అన్నారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని, నియోజకవర్గ ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, మూడా చైర్మన్ గంజి వెంకన్న, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed