- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకున్న క్లాస్ మేట్స్
దిశ, గోపాలపేట: స్నేహమంటే ఇదేరా అంటూ స్నేహ భావాన్ని చాటుకున్నారు పూర్వ విద్యార్థులు. గోపాలపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 1991-92 బ్యాచ్ విద్యార్థులు ఆదివారం ద్వితీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమతో పాటు చదువుకున్న పూర్వ విద్యార్థి గత సంవత్సరం అనారోగ్యంతో మృతి చెందాడు. తోటి స్నేహితుడు మృతిచెందడంతో స్నేహితులంతా చేయి చేయి కలిపి మృతుడి కుటుంబానికి తోడుగా నిలిచారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా తోటి స్నేహితులంతా తాడిపర్తి గ్రామంలో ఉన్న స్నేహితుడు శ్రీనివాస్ ఆచారి కుటుంబాన్ని పరామర్శించారు. మృతి చెందిన శ్రీనివాసాచారి భార్య సంధ్య, ఇద్దరు కూతుర్లను కలసి రూ.80 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన క్లాస్ మేట్స్ ను గ్రామ సర్పంచ్ పద్మ, ఉపాధ్యాయురాలు మహాలక్ష్మి, గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులైన న్యాయవాది వెంకటేశ్వర చారి, ఏఎస్ఐ మాసయ్య, గిరిజ శంకర్ బాలరాజు అశోక్ కుమార్, టి ఎస్ ఆర్ టి సి కానిస్టేబుల్ రాఘవేందర్ గౌడ్, జయపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీకర్ రెడ్డి, నాగిరెడ్డి, లక్ష్మారెడ్డి అనంతరాములు, పరమేశ్వర్, వెంకటేష్, నాగపూర్ వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, పిట్టల శేఖర్, మురళి, కానిస్టేబుల్ తిరుపతి, వెంకట్ స్వామి, రాజవర్ధన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.