కారు, ఆటో ఢీ: ఇద్దరికీ తీవ్ర గాయాలు

by Shiva |
కారు, ఆటో ఢీ: ఇద్దరికీ తీవ్ర గాయాలు
X

దిశ, అలంపూర్: కారు, ఆటో ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన అలంపూర్ చౌరస్తాలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అలంపూర్ చౌరస్తాలో కారు, ఆటో ఒకదాని వెంట మరోకటి వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా కారు టైరు బ్లాస్ట్ కావడంతో కారు అదుపు తప్పి ముందుగా వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో వెళ్తున్న ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

అదేవిధంగా కారులో ఉన్న వారు స్వల్ప గాలయతో బయట పడ్డారు. ఈ ప్రమాదాన్ని చూస్తూ అటుగా వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. స్థానికులు సమాచారం మేరకు క్షతగాత్రులను 108లో హైవే అంబులెన్స్ లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా హైవే సిబ్బంది ఎప్పటికప్పుడు వాహనాలను క్లియర్ చేశారు.

Advertisement

Next Story