- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాణేలతో నామినేషన్.!
దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్ : ఉన్నత వర్గాల చేతిలో అణిచివేతకు గురవుతున్న, అనగారిన వర్గాల సంక్షేమ అభివృద్ధి కోసం నోటు ఇవ్వడంతో పాటు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని నాగర్ కర్నూల్ బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్తపల్లి కుమార్ విజ్ఞప్తి చేశారు. గురువారం నాగర్ కర్నూల్ రిటర్నింగ్ అధికారి వెంకట్ రెడ్డికి ప్రజల చేత చందాగా తీసుకున్న ఐదు వేల నాణేలతో నామినేషన్ను దాఖలు చేశారు. ఉన్నత వర్గాలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు డబ్బు మద్యం ఆశ చూపి ఓట్లు రాల్చుకొని అధికారం చేతబూని బహుజనుల పైనే పెత్తనం చేస్తుంటారని ఆరోపించారు. తాను డబ్బు లేని వాడినని గుర్తించి తనకు చందాలుగా డబ్బు సాయం చేశారు. అలాగే ఓటు కూడా వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మన పాలన మనమే చేసుకోవచ్చు నన్నారు. వారితో పాటు జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్, జిల్లా నాయకులు నాగన్న, రామచందర్, కళ్యాణ్, శ్రీ హర్ష ముదిరాజ్ తదితరులు ఉన్నారు.