పండుగలా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం..

by Kalyani |
పండుగలా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం..
X

దిశ, చిన్న చింతకుంట: దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం గురువారం మండల కేంద్రంలోని ఎమ్మెస్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పి చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, వ్యవసాయ కో-ఆపరేటివ్ చైర్మన్ రాజ వరప్రసాదరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో చెక్ డ్యామ్ లు నిర్మించుకున్నందుకు ఎండాకాలంలో కూడా ఊక చెట్టు వాగులో చెక్ డ్యాములు నిండుకుండలా కనిపిస్తున్నాయన్నారు. బిఆర్ఎస్ పార్టీగా ఆవిర్భావం తర్వాత జూన్ 2 నుంచి దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే ఆల కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

చిన్న చింతకుంట మండల ప్రజల చిరకాల కోరిక ఊకచెట్టు వాగుపై బ్రిడ్జ్ కం చెక్ డ్యామ్ నిర్మాణం పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, కురుమూర్తి స్వామి గుట్ట పైకి బీటి రోడ్డు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని, కురుమూర్తి స్వామి రాజగోపురం నిర్మించుకున్నామని అనేక గ్రామాలకు బీటీ రోడ్లు, సిసి రోడ్లు వేసుకొని ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆత్మీయ సమ్మేళనంలో ఏర్పాటుచేసిన సహపంక్తి వనభోజనంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి దంపతులు కార్యకర్తలకు వడ్డించడంతోపాటు వారితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నచింతకుంట మండల బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story