- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గద్వాలలో భగ్గుమన్న బీఆర్ఎస్ వర్గ విభేదాలు..
దిశ,గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో దీక్షా దివస్ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ నాయకుల మధ్య ఐక్యత లేదన్న విషయం బహిర్గతమైంది. ఈనెల 29న నిర్వహించ తలపెట్టిన దీక్షా దివస్ సందర్భంగా ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం జిల్లాల వారీగా అధికారికంగా నిర్వహించింది. ఇందులో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా ఇన్చార్జి గా బీఆర్ఎస్ సీనియర్ నేత కర్నె ప్రభాకర్ ను నిర్ణయించింది. ఈ సన్నాహక సమావేశానికి జిల్లా బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఫ్లెక్సీలలో వేసిన ఫోటోలలో తమ పోటోలు వేయలేదని ఇన్చార్జి ముందే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. నాయకుల మధ్య మాటల యుద్దం కొనసాగుతుండగా..ఇన్చార్జి కర్నె ప్రభాకర్ రావ్ కలుగజేసుకొని సర్డిచెప్పడంతో సమస్య తాత్కాలికంగా సద్దుమనిగాక..బాసు హనుమంతు నాయుడు అనుచరులు మాత్రం సదరు యువనాయకున్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి గ్రౌండ్ లెవల్ లో పార్టీని మీరే ఉద్దరిస్తానుకోవడంమీ పొరపాటని , సదరు నాయకుడికి హెచ్చరించినట్టు చెప్పుకుంటున్నారు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తమ బాధను వెళ్ళకక్కుతున్నారు. యువనాయకులు ఇక ఈ అంశం ఎక్కడికి దారి తీస్తుందో అని బీఆర్ఎస్ క్యాడర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.