- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీఆర్ఎస్ పాలకులు..
దిశ, జడ్చర్ల/మిడ్జిల్: రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించినందుకు అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ లతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ పాలకులు ఖూనీ చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ చేయడాన్ని నిరసిస్తూ జడ్చర్ల , మిడ్జిల్ మండలాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. మిడ్జిల్, జడ్చర్ల మండల కేంద్రాల్లో 167వ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆందోళన చేపడుతున్న నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ఎటువంటి నోటీసులు లేకుండా పోలీసులు బండి సంజయ్ ని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీపై బండి సంజయ్ ప్రశ్నించినందుకే అరెస్ట్ లు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లె తిరుపతి, బీజేపీ మండల అధ్యక్షుడు కావలి నరేందర్, సీనియర్ నాయకులు పాండురంగారావు, ఎల్లమశెట్టి రాములు, పట్నం జంగయ్య, రామకృష్ణ, కుమార్, రాములు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.