- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి గెలిపించండి మర్చిపోలేనంత అభివృద్ధి చేస్తా : మర్రి జనార్ధన్ రెడ్డి
దిశ, బిజినేపల్లి : మరోసారి తనను నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలు తరతరాలు గుర్తుంచుకునేలా అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం బిజినేపల్లి మండలం పరిధిలోని లింగసానిపల్లి, వసంతాపూర్, కారుకొండ గ్రామాలలో మర్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా లింగసానిపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి, శివాలయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఎవరికి ఆపద ఉందని వచ్చినా వారందరికీ పనులు చేశామని తెలిపారు. గంగారంతో పాటు ఐదు గ్రామాలకు ఎత్తు ప్రాంతంలో ఉన్న పొలాల కోసం సాగునీరు ఇవ్వడానికి మార్కండేయ లిఫ్టును రేపో మాపో ప్రారంభిస్తామని అన్నారు. రాజకీయాల కోసం ఎవరు ఏమైనా మాట్లాడుతారు 50 ఏండ్లు ప్రజలు అవకాశం ఇస్తే అప్పుడు ఎం చేయలేదు కానీ ఇప్పుడు చేస్తాను అని చెబుతున్నారన్నారు.
అటువంటి వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదని, తాను చేసిన అభివృద్ధి ప్రజల కళ్ళముందే ఉందని, ఎమ్మెల్యే ఎలక్షన్లలో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 40 ఏండ్ల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న దామోదర్ రెడ్డి పనికి రాడని తన కుమారుడు రాజేష్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చారని ప్రజలు దీనిని గమనించాలన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో సర్వం కోల్పోయిన భూ నిర్వాసితులకు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల దళిత బంధు మొదటి విడతలో అమలు చేస్తానని మా తల్లి తండ్రి సాక్షిగా మీ ముందు శబదం చేస్తున్నానని అన్నారు. కొంతమంది వేరే కులాలకు చెందిన వారికి గవర్నమెంట్ తరపున వచ్చిన సబ్సిడీ రుణాలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చే విధంగా రుణాలు ఇప్పిస్తామని తెలిపారు. ఈ సారి పేద వారికి పెళ్లిళ్లు చేయకుండా నిర్వాసితుల పక్షాన న్యాయం జరిగే విధంగా మీకు కృషి చేస్తానని అన్నారు.
కారుకొండ గ్రామానికి స్కూలు, మసీద్ అడిగారని వాటిని తక్షణమే వారి ట్రస్ట్ ద్వారా కుమ్మెరలో కట్టిస్తున్న విధంగా కారుకొండలో కట్టిస్తానని, అంతేకాకుండా రామాలయాన్ని కూడా కోటి రూపాయలతో పూర్తి చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు ఆయా గ్రామాలలో మర్రికి ప్రజలు డప్పులు, మంగళ హరతులతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ మాజీ మార్కెట్ చైర్మన్ గంగన్న కిరణ్, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పులేందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు నెల్లికంటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీటీసీల మండల అధ్యక్షులు మంగి విజయ్, బీఆర్ఎస్ నాయకులు శేఖర్ రావు, రామునాయక్, కారుకొండ మాజీ సర్పంచ్ తిరుపతయ్య, ఫయాజ్, వట్టెం శాంతయ్య, వట్టెం మల్లేష్ తో పాటు పలువురు ఉన్నారు.