'ఓ రేవంత్ రెడ్డి.. బీఫామ్స్ అమ్ముకున్న ఘనత నీది'

by S Gopi |
ఓ రేవంత్ రెడ్డి.. బీఫామ్స్ అమ్ముకున్న ఘనత నీది
X

దిశ, మద్దూరు: మండల పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం మద్దూరు మండలం కేంద్రంలో పర్యటించి మాట్లాడిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా కోస్గి మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరారెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కొండారెడ్డిపల్లి నుంచి కొడంగల్ కు వలస వచ్చి ఈ నియోజకవర్గ ప్రజల ఓట్లతో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఈనాడు ఎదగడం జరిగిందని, అందువల్ల ఆయన మాటలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని ఎద్దేవా చేశారు. తిన్నింటి వాసాలు లెక్క చేసే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ అని, దాని కారణంగానే జైలు శిక్ష కూడా అనుభవించాడని విమర్శించాడు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటయ్య మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి రేవంత్ రెడ్డి చింతం లేకుండా మాట్లాడుతున్నారని, 2009 మరియు 2014 సంవత్సరపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కాడని, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీసీల కోసం ఏర్పడ్డ టీడీపీ పార్టీ గుండెల్లో గుణపం దింపారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఒక వలసవాది అని లిపి సంవత్సరం లాగా అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారని అన్నారు. శుక్రవారం రోజు జరిగిన ర్యాలీలో ప్రజలు లేకపోవడంతో ప్రజాదరణ కరువైందని, పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాని నువ్వు 2017 సంవత్సరంలో మాత్రం రాజీనామా డ్రామా నిర్వహించావు.

తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న వివిధ మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గెలుపొందిన తరుణంలో అభివృద్ధి అనేది పరుగులు పెడుతుందని అన్నారు. మద్దూరు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో అభివృద్ధిని చూసి రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడని, మండలంలో సబ్ స్టేషన్లు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, పేదవారికి రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, ఇంటింటికి మిషన్ భగీరథ నీరు అందించడం రేవంత్ రెడ్డికి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దూరు పట్టణ కేంద్రంలో 2014 సంవత్సరంలో పశువుల సంత, గురుకుల పాఠశాల కోసం ఏర్పడిన స్థలం గ్రామపంచాయతీ నిధుల ద్వారా తీసుకోవడం జరిగిందని, ఇట్టి స్థలాన్ని రేవంత్ రెడ్డి ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని, ఇట్టి విషయాన్ని రేవంత్ రెడ్డి నిరూపించుకోవాలని, 30 పడకల ఆసుపత్రిని తానే తెచ్చానని గొప్పగా మాట్లాడుకోవడం, తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ తరఫున కాబోయే 119 మంది ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల బీఫాంలు తానే ఇస్తానని తనకు తానే గొప్పగా ఊహించుకుంటున్నారని విమర్శించారు. 2024 సంవత్సరంలో కొడంగల్ నియోజకవర్గ ప్రజలు పట్నం నరేందర్ రెడ్డిని మళ్లీ గెలిపించుకుని కొడంగల్ గడ్డపై గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల బిఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story