- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం: ఎమ్మెల్యే చిట్టెం
దిశ, ఊట్కూర్: బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. శనివారం పగిడిమర్రి క్లస్టర్ పరిధిలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రైతు వేదికలో నిర్వహించిన రైతు దినోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఉత్సవాలలో పాల్గొన్నారు. పగిడిమర్రి రైతు వేదిక, పల్లె దవాఖాన ఆయుష్మాన్ భారత్ వెల్నెస్ సెంటర్ వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగంలో రైతులకు అండగా నిలుస్తూ నేడు దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని అన్నారు.
ముఖ్యమంత్రి స్వయంగా రైతు బిడ్డ అయినందున మక్తల్ పై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తన హయాంలో మూడు మున్సిపాలిటీలు, మోడల్ స్కూల్ ఏర్పాటు చేసుకున్నట్లు, మక్తల్ కు మూడు వేల ఇళ్ళు వచ్చాయని, 150 పడకల ఆసుపత్రిని మంజూరు చేశారని తెలిపారు. ఊట్కూర్ కి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తీసుకొస్తాం అని ఆయన అన్నారు. మన ఊరు మనబడి కింద అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అంతకు ముందు రైతు దినోత్సవం సందర్భంగా రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను, సాధించిన ప్రగతిని వివరిస్తూ వ్యవసాయ విస్తరణ అధికారి ప్రభుత్వం అందించిన సందేశాన్ని రైతులకు చదివి వినిపించారు.
గత తొమ్మిది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించి, రైతు సంక్షేమ దిశగా పటిష్ట చర్యలు తీసుకొని, ప్రతి దశలో రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి కృష్ణమాచారి, జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ రామ్ మోహన్ రావు, మండల వ్యవసాయ అధికారి గణేష్ రెడ్డి, ఎంపీడీవో కాళప్ప, జెడ్పిటిసి అశోక్ గౌడ్, ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, రైతు బంధు మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, పిఎసిసిఎస్ చైర్మన్ బాల్ రెడ్డి, సర్పంచ్ సులోచనమ్మ తదితరులు పాల్గొన్నారు.