- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BIG News: గద్వాల జిల్లాలో సంచలనం.. వ్యక్తిని హత్య చేసి బైక్‌పై తరలించిన నిందితులు (వీడియో వైరల్)
దిశ, వెబ్‌డెస్క్: మానవత్వం మరోసారి మంటగలిసిపోయింది. తోడబుట్టినోడనే కనికరం లేకుండా ఓ వ్యక్తిని ఇద్దరు అత్యంత కిరాతకంగా హత్య చేసి బైక్‌పై తరలించిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి, శేషిరెడ్డి, చిన్న నాగిరెడ్డి అన్నదమ్ములు. అయితే, ముగ్గురి మధ్య గత ఏడాదిగా ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరోమారు వారి మధ్య వివాదం రేకెత్తగా.. మాట్లాడుకుందాం అంటూ శేషిరెడ్డిని అన్న మహేశ్వర్ రెడ్డి, తమ్ముడు నాగిరెడ్డి బైక్‌పై ఊరి శివార్లకు తీసుకెళ్లారు. అనంతరం అక్కడ శేషిరెడ్డిని అత్యంత దారుణంగా హతమార్చారు. ఎవరికీ అనుమానం రాకుండా బైక్‌పై మధ్యలో మృతదేహాన్ని ఉంచి మొహంపై ముసుగు వేశారు. ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లా కొత్తకోట శివారులో డెడ్‌బాడీని పడేసేందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన కొందరు వ్యక్తులు సెల్‌ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు తీశారు. దీంతో భయపడిన వారు చేసేదేమి లేక మృతదేహాన్ని అక్కడే వదిలేసి పోలీసుల ఎదుట లొంగిపోయారు.