- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Gaddar idol : గద్దర్ సామాజిక వర్గాల ఉద్యమ మహోన్నతుడు..
దిశ, అచ్చంపేట : గద్దర్ అనగానే విప్లవోద్యమ నాయకుడే కాదని సామాజిక వర్గాల విప్లవ మహోద్యమ నేత అని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ ప్రధమ వర్ధంతి సందర్భంగా అచ్చంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద గద్దర్ అభిమానులు, ప్రజాసంఘాల నాయకులు ఏర్పాటు చేసిన ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పొడుస్తున్న పొద్దు అమరుడు గద్దర్ విగ్రహ ఏర్పాటు కోసం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అణగారిన, బలహీన వర్గాల గళం, తెలంగాణ సాంస్కృతిక విప్లవ రచయిత, విప్లవ గాయకుడు, ప్రజాయుద్ధ నౌక దివంగత ప్రజానాయకులు గద్దర్ కు ఈ నల్లమల్ల ప్రాంతంతో ఎంతో అవినాభావ సంబంధం ఉందన్నారు. గద్దర్ స్ఫూర్తితో ఎంతో మంది కళాకారులు మా ఆట పాటలను చూసి నేర్చుకున్నారని, రాష్ట్రప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా గద్దర్ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ త్వరలో ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటిస్తుందన్నారు.
తన చివరి సమయంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడం వలన చలో ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయిందని, గద్దర్ సేవలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులకి అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.
పాటకు పోరాటం నేర్పి.. తన గళంలో తూటాగా మార్చి… అన్యాయం పై ఎక్కుపెట్టిన…తెలంగాణ సాంస్కృతిక శిఖరం గద్దరన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, ప్రజా సంఘాలు నాయకులు గోపాల్, నాసరయ్య, కాశన్న, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన కార్యదర్శి కుంద మల్లికార్జున్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్ట గోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు, గద్దర్ అభిమానులు పాల్గొన్నారు.