- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లబ్దిదారులు రేషన్ సరుకులు ఎక్కడైనా తీసుకోవచ్చు: కలెక్టర్ కోయ శ్రీ హర్ష
దిశ, ప్రతినిధి నారాయణపేట/ ధన్వాడ: లబ్దిదారులు రేషన్ సరుకులు ఎక్కడైనా తీసుకోవచ్చని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. పేట మండలం సింగారం, లింగంపల్లి, ధన్వాడ మండల కేంద్రంలోని 4606001, 4602008, 4602003నెంబర్లు గల చౌక ధర దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ చౌకధర దుకాణాల్లో నిల్వ ఉన్న బియ్యంను పరిశీలించారు. ఎంత స్టాక్ మిగిలింది..? వాటి వివరాలను రిజిస్టర్ లో పరిశీలించారు. లబ్దిదారులు ప్రతి ఒక్కరూ సరుకులను తీసుకువెళ్లాలని పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీలో ఉన్న కార్డులు ఎన్ని..? వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు అందించిన బియ్యం వివరాలు ఇంకా షాపులో నిల్వ ఉన్న వాటిని పరిశీలించారు. అనంతరం ధన్వాడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది యొక్క అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు. ఆసుపత్రికి సమయానికి చేరుకోవాలని వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించినప్పుడే ఓపీలు పెరుగుతయన్నారు. ఆసుపత్రి మొత్తాన్ని తిరిగి పరిశీలించారు. కలెక్టర్ వెంట తనిఖీ సమయంలో సివిల్ సప్లై అధికారి శివప్రసాద్, డిటి కాళప్ప తదితరులు ఉన్నారు.